Home » Kukatpally
ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ జే పవన్ కుమార్ (57) అనారోగ్యంతో మృతిచెందారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ(56) అనే మహిళ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది.
‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం’ అన్నచందంగా తయారైంది జేఎన్‌టీయూ(JNTU) పరిధిలోని అటానమస్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 80 అటానమస్ హోదా కలిగిన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండ గా, సగానికి పైగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిలిపివేశారు.
హైడ్రా చర్యలతో మధ్య తరగతి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కూకట్‌పల్లి నల్లచెరువులో ఆదివారం హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఆ బస్సు హెల్పర్‌ను కూకట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది.
చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే, హైడ్రా పేరుతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. ట్రాఫిక్ సమస్య. అలాంటి మహానగరంలో రహదారిపై ఓ వాహనం సాంకేతిక సమస్యతో ఆగిపోయిందంటే.. ఇక వాహనదారులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం ఎప్పుడో మానేసి.. వాహనదారులకు చలానాలు రాసే పనిలో వారంత నిమగ్నమైపోయారు.
నగరంలోని కూకట్‌పల్లికి చెందిన లీప్ రోబోట్స్ సంస్థకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు. ఈ మేరకు సేవ్ ది ఎర్త్ అంశంపై ఆవిష్కరించిన క్రియేటివ్ డిజైన్‌కు గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకుని అబ్బురపరిచారు.
ఏటా రూ.15 కోట్లు వెచ్చిస్తున్నా గ్రేటర్‌లో దోమల తీవ్రత పెరుగుతోంది. డెంగీ, మలేరియా(Dengue, Malaria) కేసులు అధికమవుతున్నాయి. లార్వా దశలో నియంత్రణకు రసాయనాల వినియోగం కాగితాలకే పరిమితమవుతోంది. ఫాగింగ్‌లో వాడాల్సిన డీజిల్‌ను అధికారులు తాగేస్తుండడంతో దోమలు ప్రజల రక్తం తాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో బయటపడిన మరో అవినీతి బాగోతం ఇందుకు నిదర్శనం.