Home » Kukatpally
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నగరంలో కూకట్‌పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 500కు పైగా సీట్లకు కోత పడనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అటు విద్యార్థుల్లో, ఇటు అధ్యాపక వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తననే నమ్ముకొని ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చిన స్నేహితురాలిపట్ల ఘోరానికి పాల్పడ్డాడా యువకుడు పార్టీ చేసుకుందాం అని పిలిచి.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు.
నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ)లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఏరియాలోని వారికి ఇది ఉపయోగకరంగా మారనుంది. అలాగే తక్కువ ఫీజుతో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు అవకాశం కల్పించారు.
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ తీపికబురు చెప్పింది. అదేంటంటే.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూసే.. విద్యార్థులు తమ క్లాస్‌వర్క్‌ను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు వీలు కల్పించింది.
రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయం అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కతుర్తిలో నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అన్నారు. సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను ఇంతకాలం అద్దెకు తీసుకుని నడుపుతున్న లులూ యాజమాన్యం ఇప్పుడు మంజీరా మాల్ ను వేలంపాటలో రూ.319.42 కోట్లకు స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తోందన్నారు.
బీఆర్ఎస్ నేతలు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకోబోమని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, బాలానగర్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య హెచ్చరించారు.
జేఎన్‌టీయూ స్నాతకోత్సవం ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ నెల రెండోవారం లోగా స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని రెండు నెలల కిందట నోటిఫికేషన్ విడుదల చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు తీరా గడువు సమీపించే సరికి తూచ్.. ఇప్పుడు కాదంటూ చేతులెత్తేశారు.