Home » KTR
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు ఆసక్తికర ట్వీట్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని.. దాంతో నగర కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల పట్టణం బివైనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే సిరిసిల్లా జిల్లాను తీసేస్తారని ఆయన విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ.. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఆరోపించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేఎల్ఎస్ఆర్‌కు అప్పగించారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఎందుకు ఇచ్చామంటే యువతకి భరోసా కల్పించేందుకేనని ఆయన వివరించారు.
తెలంగాణ నిరుద్యోగులను సీఎం రేవంత్ నమ్మించి నయవంచన చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోందని అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార, అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా..
గతంలో రాహుల్, సోనియాలను ఈడీ విచారణకు పిలిస్తే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నాలు చేశారో.. ఇప్పుడు పనికిరాని విచారణ పేరిట మా నాయకుడిని విచారణకు పిలిచినందుకు మేమూ ధర్నా చేశాం....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, ప్రభుత్వ చర్యలను ఎక్కడికక్కడ ఖండించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.