Home » Kodi Kathi
: జై భీమ్ రావు భారత్ పార్టీలో కోడికత్తి శ్రీనివాస్ చేరారు. ఈరోజు గాంధీ నగర్ జై భీమ్ రావు భారత్ పార్టీ కార్యాలయంలో శ్రీను ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్‌గా మారిన దస్తగిరి పార్టీలో చేరారు.
సీఎం జగన్ రెడ్డి(CM Jagan) గత ఎన్నికల్లో మాజీమంత్రి వివేకానందారెడ్డి (బాబాయ్) హత్య, కోడి కత్తి శీను పేరు చెప్పి లాభం పొందారని మాజీ ఎంపీ హర్ష కుమార్(Harsha Kumar) అన్నారు. శనివారం నాడు హర్ష కుమార్‌ను కోడి కత్తి శీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.
Andhrapradesh: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 19కి ఏన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టు వాయిదా వేసింది.
కోడికత్తి శ్రీను, బెయిల్‌పై విడుదలైన తర్వాత మొదటిసారిగా విశాఖలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యాడు. ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకుడు బూసి వెంకట్రావు మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి.. ఏదో ఒక కారణం చెప్పి కోర్టుకు హాజరు కావడం లేదన్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం కోడి కత్తితో శీనివాస్ అనే యువకుడు దాడి చేశాడు. ఈ కేసులో అతడికి శుక్రవారం నాడు బెయిల్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను శీను లాయర్లు మీడియాకు వివరించారు.
Andhrapradesh: ఢిల్లీలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. గురువారం ఢిల్లీ ఏపీ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం ముందు కోడి కత్తి శ్రీను తల్లి,అన్న సుబ్బరాజు, టీడీపీ మైనార్టీ హక్కుల నాయకులు ధర్నా చేపట్టారు.
అమరావతి: కోడి కత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని..
Andhrapradesh: విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఒక నాటకం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖ విమానాశ్రయంలోకి గుండుసూది కూడా ప్రవేశించలేని పటిష్ట భద్రత ఉంటుందని.. కోడి కత్తి దాడిలో జగన్ దేహం నుంచి రక్తం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
Andhrapradesh: కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడికత్తి శ్రీను తరుపున సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు.
Andhrapradesh: కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడో రోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి.