Home » Kodandaram
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు.
ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన వైద్యం అందాలంటే వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు
ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.
మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అనేక ఉపద్రవాలు వస్తాయని, ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రజల ఏకైక లక్ష్యం కావాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.
దేశ సంపద అంత బడాబాబులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచి పెడుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) అన్నారు. దేశంలో 162 మంది సంపన్నులుంటే....జాతీ సంపద అంత 25 శాతం మంది గుప్పిట్లోనే ఉందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు.
తెలంగాణలో గవర్నర్ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram), మీర్ అమీర్ అలీఖాన్(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: కాళేశ్వరంపై బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని, కాగ్ చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
Telangana: దొంగే దొంగ అన్నట్లు బీఆర్ఎస్ వైఖరి ఉందని టీజేఎస్ చీఫ్ కోదండరాం వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.... మూడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ పటిష్టంగా ఉందని చెప్పడం శుద్ద తప్పన్నారుు. ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయన్నారు. మూడు పిల్లర్లే కదా కుంగిపోయిందని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) కూల్చాలన్న బీఆర్ఎస్ నేతల కుట్రలను ప్రజాస్వామ్యవాదులు తిప్పికొట్టాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Kodandaram) హెచ్చరించారు. డబ్బులతో బీఆర్ఎస్ రాజకీయాలను శాసించాలనుకుంటోందని ఆరోపించారు.