• Home » KL Rahul

KL Rahul

India vs England: ఇంగ్లండ్‌తో 5వ టెస్టుకు టీమ్‌ని ప్రకటించిన బీసీసీఐ.. రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ ప్లేయర్

India vs England: ఇంగ్లండ్‌తో 5వ టెస్టుకు టీమ్‌ని ప్రకటించిన బీసీసీఐ.. రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ ప్లేయర్

భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.

IND  vs ENG: టీమిండియాకు షాక్.. చికిత్స కోసం లండన్‌కు మరో కీలక ప్లేయర్

IND vs ENG: టీమిండియాకు షాక్.. చికిత్స కోసం లండన్‌కు మరో కీలక ప్లేయర్

గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాహుల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూడా రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది.

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు..

IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు..

స్టార్ ఆటగాళ్లు వరుసగా జట్టుకు దూరమవుతున్న వేళ నిరాశలో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది.

India vs England: రెండో టెస్టుకి ఆ ఇద్దరు దూరం.. వారి స్థానంలో ఈ ముగ్గురికి చోటు!

India vs England: రెండో టెస్టుకి ఆ ఇద్దరు దూరం.. వారి స్థానంలో ఈ ముగ్గురికి చోటు!

తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత జట్టుకి తాజాగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వాళ్లే.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా & కేఎల్ రాహుల్.

IND vs ENG: టీమిండియా ఓటమికి అదే ప్రధాన కారణం.. ఆ క్యాచ్ పట్టి ఉంటే..

IND vs ENG: టీమిండియా ఓటమికి అదే ప్రధాన కారణం.. ఆ క్యాచ్ పట్టి ఉంటే..

ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.

IND vs ENG: రికార్డు సృష్టించిన బ్యాటర్లు.. 92 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

IND vs ENG: రికార్డు సృష్టించిన బ్యాటర్లు.. 92 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

IND vs ENG: రెండో రోజు ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్

IND vs ENG: రెండో రోజు ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు భారత్ ఆధీక్యం కొనసాగింది. తొలి రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది.

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్‌పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.

IND vs ENG: పటిష్ట స్థితిలో టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

IND vs ENG: పటిష్ట స్థితిలో టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయాస్ అయ్యర్ (34) ఉన్నారు.

IND vs ENG: కీపర్‌గా కిషన్, బ్యాటర్‌గా రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు వ్యూహం మార్చిన టీమిండియా!

IND vs ENG: కీపర్‌గా కిషన్, బ్యాటర్‌గా రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు వ్యూహం మార్చిన టీమిండియా!

భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి