Home » Khammam
రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మితమైన ఈ ఇంటిని గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తెలంగాణ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ సమీపంలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్ స్టేడియంలో ముగిశాయి.
కొత్తగూడెం సింగరేణికి చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం మృతిచెందారు. పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆయమ ప్రాణాలు విడిచారు. అనంతరం కుటుంబ భారం అంతా కుమారుడిపై పడింది. దీంతో అతను కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.
వ్యక్తిత్వం, విలువలు ఉంటే మనిషి అద్భుతమైన శక్తిని సాధించగలుగుతాడని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు.
కోడి గుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. చలికాలంలో ధరలు పెరగటం సాధారణమే అయినా ఈస్థాయిలో పెరిగిన దాఖలాలు లేవని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటివరకూ రూ.66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మీరూ అప్పులు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని అంటున్నారు, వాళ్లు దోచుకోటానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
కథా సాహిత్యానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా అన్నారు. ఈస్థటిక్స్ స్పేస్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో మొదలైన కథాంతరంగం సాహిత్య కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.