Home » Kerala
Kerala cargo ship: కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
కొలంబో నుంచి ఈ నెల 7న బయలు దేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసి ఉంది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణశాఖ పీఆర్ఓ తెలిపారు.
మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కేరళలో పర్యటిస్తుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్, నవంబర్‌లో ఈ పర్యటన ఉండొచ్చని తెలిపారు.
కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.
కొనసాగుతున్న భారీ వర్షాల దృష్ట్యా, కేరళ అంతటా జిల్లా యంత్రాంగాలు ఇవాళ (మే 30)న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. ఇడుక్కి వంటి హై-రేంజ్ ప్రాంతాలలో రాత్రి ప్రయాణాన్ని సా. గం.7 నుండి ఉ. గం.6 వరకు నిషేధించారు.
Elephant Viral Video: కారు బరువు 2వేల కేజీలకు పైనే ఉంటుంది. నది ఒడ్డున మొత్తం ఇసుక ఉండటంతో దాన్ని బయటకు తీసుకురావటం మనుషుల వల్ల కాలేదు. దీంతో ఓ గజ రాజాన్ని రంగంలోకి దింపారు. కారు ఉన్న దగ్గరకు తీసుకెళ్లారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 16ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం, ఈదురుగాలు తోడవడంతో అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు నెలకొన్నాయి.
గుజరాత్‌లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
రాబోయే 24 గంటల్లో రుతుపవనాలు (Early Monsoon 2025) కేరళకు చేరుకోనున్నాయి. ఈ క్రమంలో షెడ్యూల్ చేసిన సమయానికి ముందే రుతుపవనాలు భారతదేశానికి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన ఘనత 16 సంవత్సరాల తర్వాత నమోదవుతున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో భారీ వర్షాలు కురియగా.. ముంబై, ఢిల్లీ, బెంగాల్‌లోనూ అదే తీరు కనిపిస్తోంది.