• Home » Kejriwal Arrest

Kejriwal Arrest

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఈడీకి నోటీసులు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఈడీకి నోటీసులు

లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్‌ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Sunita Kejriwal: ఢిల్లీలో బిహార్ సీన్ రిపీట్.. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య!

Sunita Kejriwal: ఢిల్లీలో బిహార్ సీన్ రిపీట్.. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తరచూ మీడియా ముందుకు రావడం, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఢిల్లీలో రిపీట్ కావొచ్చని.. కేజ్రీవాల్ సీఎం కుర్చీని సునీత కైవసం చేసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా స్పందన.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా స్పందన.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా.. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Kejriwal: జైలు నుంచే జోరు.. రెండో ఆర్డర్స్ జారీ చేసిన కేజ్రీవాల్..

Kejriwal: జైలు నుంచే జోరు.. రెండో ఆర్డర్స్ జారీ చేసిన కేజ్రీవాల్..

దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.

Kejriwal: కంప్యూటర్, కాగితాలు ఎలా అందాయి.. జైలు నుంచే ఆర్డర్స్ ఇష్యూపై ఈడీ చర్యలు..

Kejriwal: కంప్యూటర్, కాగితాలు ఎలా అందాయి.. జైలు నుంచే ఆర్డర్స్ ఇష్యూపై ఈడీ చర్యలు..

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.

Kejriwal Arrest: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ అంటే భయం.. ఆయన ఇప్పుడు మరింత ప్రమాదకరం

Kejriwal Arrest: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ అంటే భయం.. ఆయన ఇప్పుడు మరింత ప్రమాదకరం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు ఇతర ప్రతిపక్షాలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. కేంద్రంలోని బీజేపీపై (BJP) విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని అన్నారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం.. ఈడీపై నిప్పులు చెరిగిన ఆప్

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం.. ఈడీపై నిప్పులు చెరిగిన ఆప్

మద్యం కుంభకోణానికి (Liquor Scam) సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న తన పాత ఫోన్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వదిలించుకున్నారని ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వాదనల్ని తోసిపుచ్చిన ఆప్.. ఈ విచారణ బీజేపీ (BJP) కార్యాలయం నుంచి జరుగుతోందంటూ ఆరోపించింది.

TG Politics: అందుకే  కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.. బీజేపీ నేతలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం

TG Politics: అందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.. బీజేపీ నేతలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం

ఈడీ కేసుల పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కాలని కేంద్ర బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వల్ల బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని మోదీ అండ్‌ కో భయపడ్డారని విమర్శించారు.

Kejriwal Arrest: నియంతృత్వంపై పోరుకు సై.. 31న ఇండియా బ్లాక్ మెగా ర్యాలీ

Kejriwal Arrest: నియంతృత్వంపై పోరుకు సై.. 31న ఇండియా బ్లాక్ మెగా ర్యాలీ

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా బ్లాక్ కూటమి ముక్తకంఠంతో ఖండించింది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన ఆదివారం నాడు మెగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Kejriwal: నిర్బంధంలో ఉన్నా డోంట్ కేర్.. ఫస్ట్ ఆర్డర్ జారీ చేసిన కేజ్రీవాల్..

Kejriwal: నిర్బంధంలో ఉన్నా డోంట్ కేర్.. ఫస్ట్ ఆర్డర్ జారీ చేసిన కేజ్రీవాల్..

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి