• Home » Kavitha Arrest

Kavitha Arrest

Kavitha: ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో కవిత పిటిషన్.. ఇంతకీ ఏమైంది?

Kavitha: ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో కవిత పిటిషన్.. ఇంతకీ ఏమైంది?

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్‌ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్‌లో తెలిపారు.

MLC Kavitha: ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన కుమారుడు ఆర్య..

MLC Kavitha: ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన కుమారుడు ఆర్య..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితను ఆమె కుమారుడు ఆర్యతో పాటు కుటుంబ సభ్యులు, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ రోజుకు గంట సేపు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో ఆమెను కలుస్తున్నారు. తాజాగా కవిత కుమారుడు ఆర్య ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు.

KCR: కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఏమన్నారంటే..?

KCR: కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఏమన్నారంటే..?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్(Kejriwa) అరెస్టును బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చ‌రిత్రలో చీక‌టి రోజుని అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రతిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ వ్యవహారంలో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈడీ అధికారులపైనే గూఢచర్యం

Arvind Kejriwal: కేజ్రీవాల్ వ్యవహారంలో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈడీ అధికారులపైనే గూఢచర్యం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యవహారంలో తాజాగా మరో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులపైనే గూఢచర్యం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం  కేజ్రీవాల్‌‌ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ

Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌‌ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్‌లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది.

MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత షెడ్యూల్ ఇదే..!

MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత షెడ్యూల్ ఇదే..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో కవిత దినచర్య ఎలా ఉందనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం కవిత రోజువారి దినచర్య ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!

Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్టయ్యారంటే..

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్టయ్యారంటే..

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal Arrest) అరెస్ట్‌తో ఈ కేసు పీక్స్‌కు చేరింది. 2022లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ(ED), సీబీఐ(CBI) వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

Kavitha Arrest - ED: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

Kavitha Arrest - ED: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. కవితను అరెస్టు చేసిన రోజున వీరిద్దరి ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత సహాయకుల పాత్రపై క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Kavith Arrest - ED: కవిత అరెస్ట్‌పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

Kavith Arrest - ED: కవిత అరెస్ట్‌పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ నేత, ఎంపీ అర్వింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ ఈడీకి సహకరించాలని అన్నారు. ఈడీ విచారణకు పిలిస్తే.‌. హాజరు కాకుండా అనిల్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి