Home » Kaushik Reddy
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ముందుస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండుగపూట బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కింద కేసులు నమోదు అయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.
తెలంగాణ: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్‌లో ఇవాళ (ఆదివారం) జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Telangana: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు అయింది. గురువారం కౌశిక్‌రెడ్డి పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. రాత్రి ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు ముందు, తర్వాత హైడ్రామా నెలకొంది. కౌశిక్ రెడ్డి అరెస్టును అడ్డుకొనేందుకు కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలను వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు.