BRS: కౌశిక్‌రెడ్డికి బెయిల్
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:14 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మంగళవారం ఉదయం బెయిల్ మంజూరైంది. ఆయనను కరీంనగర్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ క్రైం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మంగళవారం ఉదయం బెయిల్ మంజూరైంది. ఆయనను కరీంనగర్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు కరీంనగర్‌కు తరలించి రాత్రంతా త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మంగళవారం ఉదయం కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎం. హేమలత ఎదుట హాజరుపరచగా.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు కావడంతో కరీంనగర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
ఆయనే నాపై దాడి చేశారు: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ‘‘వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని సంజయ్ కుమార్.. బీఆర్‌ఎస్ తరఫున కారు గుర్తు, కేసీఆర్ బొమ్మతో ఎమ్మెల్యే అయ్యాడు. డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రె్‌సలో చేరాడు’’ అని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ డీఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ తనను రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఆయనే మొదట తనపై దాడి చేశారని ఆరోపించారు. రైతు భరోసా కోసం ప్రశ్నించానని, రైతు రుణమాఫీ పూర్తి చేయాలని అడిగానని.. అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. కాగా, బంజారాహిల్స్ సీఐ విధులు అడ్డుకున్న వ్యవహారంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రెండు నెలల క్రితం బంజారాహిల్స్ పీస్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణను మాసబ్‌ట్యాంక్ పోలీసులు చేపట్టా రు. ఈనెల 16న విచారణకు రావాలని పోలీసులు బు ధవారం కౌశిక్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. అయితే తాను 17న హాజరవుతానని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.