Home » Kangana Ranaut
మండీ నియోజకవర్గ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంటులో గురువారం తొలిసారిగా ప్రసంగించారు. తన నియోజకవర్గంలో, రాష్ట్రంలో అంతరించిపోతున్న కళారూపాలపై ఆవేదనా భరితప్రసంగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె నెట్టింట పంచుకున్నారు.
తనను కలవాలంటే ఆధార్ కార్డుతో రావాలంటూ నియోజకవర్గ ప్రజలకు మండీ ఎండీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ నిబంధన విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. కంగనా తీరు సరికాదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేళ.. పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇద్దరు ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ సోమవారం స్పందించారు.
చండీగఢ్ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి ఘటనను సమర్థించిన వారిపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
చండీగఢ్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎ్‌సఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా.. విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెపై చేయు చేసుకున్నట్లు కుల్విందర్ కౌర్ వెల్లడించారు.
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను(Kangana Ranaut) చండీగఢ్ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్(CISF) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు రైతు సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ కేసులో కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల బాలీవుడ్ నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్‌పై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసిన విషయం అందరికీ..
ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ని కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనలో బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందించింది. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. అనంతరం ఆ పోస్ట్‌ను ఆమె తొలగించింది. ఈ ఘటనపై మీరు వేడుక చేసుకొంటూ ఉండవచ్చు లేదా నిశ్శబ్దంగా ఉండవచ్చు.
చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ తనను కొట్టారని బాలీవుడ్ నటి, బీజేపీ తరఫున తాజా ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లటం కోసం తాను చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎ్‌సఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగన తెలిపారు.