Home » Kakinada
తాళ్లరేవు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందిన ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వారు వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Mudragada: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగలేఖ రాశారు. తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తోందంటూ ఆయన తన కుమార్తె క్రాంతిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మనస్పర్దలతో ఆ కుటుంబం జోలికి వెళ్లకపోయినా టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 ప్రభుత్వ ఆస్పత్రులకు సీటీ స్కాన్ మిషన్లు ఏర్పాటు చేయాలని రూ. 27 కోట్ల నిధులను ఆమోదించింది. అదేవిధంగా 3 ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి రూ. 17 కోట్ల నిధులు విడుదలకు ఆమోదమివ్వబడింది.
గోదావరి నదిలో 8 మంది 21 ఏళ్ల లోపువారైన యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మరియు కోనసీమ జిల్లాకు చెందినవారు.
Annavaram Temple: కాకినాడ అన్నవరం సత్యదేవుడి కొండపై తెలంగాణకు చెందిన మహిళా భక్తులకు తీవ్ర అవమానం జరిగింది. స్వామి వారి సేవకు రావాలని అనుకుని దేవస్థానం అధికారులను సంప్రదించగా.. 20 మంది వరకు అనుమతిస్తామని సమాచారం ఇచ్చారు.
Kakinada Land Grabbing Case: కాకినాడలో వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడు చేసిన భూ కబ్జా బయటకు వచ్చింది. తన భూమిని ద్వారంపూడి అనుచరుడు కబ్జా చేశారని పోలీసులకు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్ అధికారి వెంకట రామానాయుడు ఫిర్యాదు చేశారు.
కాకినాడ తుని రూరల్ ప్రాంతంలో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు; వారంతా అపోలో ఫార్మసీ ఉద్యోగులు.
Crime News: ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో తుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
కాకినాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తమ ఐదేళ్ల పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిం ది. ముఖ్యంగా ఆ పార్టీ నేతలు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. డీబీటీ పద్ధతిలో ప్రజలకు అనేక పథకాల పేరుతో వారి ఖాతాల్లో డబ్బులు వేసినా.. అభివృద్ధిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది ఆ ప్రభుత్వం. అంతేకాదు ఆ పార్టీ నేతల నోటి దురుసు, దందాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అంతే సంగతులు అని భావించిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని అధి కార పీఠం నుంచి కిందకు దించారు. ఉ
కలెక్టరేట్ (కాకినాడ), మే 16 (ఆంధ్రజ్యోతి): అనుకోని విపత్తులు సంభ వించినప్పుడు ఎదు ర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో శుక్ర వారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, వైద్య-ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా మెట్లు, నిచ్చెనల ద్వారా గాయ పడిన వారిని తీసుకువచ్చి తాత్కాలిక వైద్య శిబి రంలో ప్రథమ చికిత్స అందించి