Share News

Kakinada Port Case: విక్రాంత్‌రెడ్డి ఎల్‌వోసీపై హైకోర్టు స్టే

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:21 AM

కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో నమోదైన కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై సీఐడీ అధికారులు జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ)పై హైకోర్టు స్టే విధించింది.

Kakinada Port Case: విక్రాంత్‌రెడ్డి ఎల్‌వోసీపై హైకోర్టు స్టే

  • విచారణ నాలుగు వారాలు వాయిదా

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో నమోదైన కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై సీఐడీ అధికారులు జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ)పై హైకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి మంగళవా రం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తనపై జారీ చేసిన ఎల్‌వోసీ కొట్టివేయాలని కోరుతూ విక్రాంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విక్రాంత్‌రెడ్డి తరఫున న్యాయవా ది వై. నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఎల్‌వోసీ అమలును నిలుపుదల చేయాలని కోరారు. సీఐడీ తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నీలోత్పల్‌ స్పందిస్తూ.. వివరాలు తెప్పించుకొని, వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

Updated Date - Jul 02 , 2025 | 05:22 AM