Home » KADAPA
మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.
Notice To YSRCP Leaders: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి కండిషన్ బెయిల్ దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ఉన్నారు. దీంతో పులివెందుల పోలీసులు హైదరాబాద్ వెళ్లి వారికి నోటీసులు అందించారు.
తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు.
ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో వివరించారు.
పులివెందులలో వైసీపీ గత రెండు రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తే ఎన్నికలబరి నుంచి తప్పుకునేందుకు తాపత్రయం పడుతున్నట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఎమ్మెల్సీ ఆయన ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పులివెందుల, ఒంటి మిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు కట్టుదిట్ట భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. కడప పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్ప వని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ హెచ్చరించారు. డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పులివెందుల జడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకుని రావాలని.. తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.
శివశంకర్‌ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ.. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్‌ను ఏపీకి బదిలీ చేయాలని హైకోర్టు జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు జూలై 31తో ముగిసింది. అయితే.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్‌ను ఆశ్రయించారు.