Home » Jupally Krishna Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను మంత్రి గుర్తు చేశారు...
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు.
హైదరాబాద్, మే 27: ఇన్ని రోజులు ఏపీలో(Andhra Pradesh) మాత్రమే కొత్త కొత్త పేర్లతో బీర్లను చూశారు.. ఇప్పుడు తెలంగాణలోనూ(Telangana) కొత్త బీర్లు కిక్కు ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త కొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ ..
హత్యారాజకీయాలకు పాల్పడుతోంది బీఆర్‌ఎస్సేనని.. వివాదాల కారణంగా జరిగిన హత్యలను రాజకీయాలకు ముడిపెడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో తన హస్తం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్‌రెడ్డి (52) అనే బీఆర్‌ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి తన సొంత పొలంలోని కల్లం దొడ్డి వద్ద నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డిని దుండుగులు గొడ్డలితో నరికిచంపారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) పోద్బలంతో నియెజకవర్గంలో రెండు హత్యలు జరిగాయని.. వెంటనే ఆయనను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.