Home » Jharkhand
పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా 19 కేజీల డ్రగ్స్‌ని ఖాళీ చేసేశాయి. ఏంటీ.. ఎలుకలు గంజాయిని కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. నమ్మలేకపోయినా ఇదే నిజమని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జార్ఖండ్‌లో జేఎంఎంకు గట్టి షాక్ తగిలింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు, జేఎంఎం నేత సీత సోరెన్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరారు. శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ సీత సోరెన్. అనారోగ్యంతో దుర్గా సోరెన్ మరణించారు. ఆ తర్వాత సీత సోరెన్‌ను శిబు సోరెన్ ఇతర కుటుంబ సభ్యులు పట్టించుకోలేదట.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.
రాంచీ: మనీ లాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)ను తలుచుకుని ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు. రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పర్యటన కోసం స్పెయిన్ నుంచి వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం ( Crime News ) జరిగింది. మార్చి 2 శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.
లోక్‌సభ ఎన్నికల ముంగిట కీలక పార్టీలో నేతల వలసలు కొనసాగుతున్నాయి. జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడ భార్య, సింగ్భూమ్ కాంగ్రెస్ ఎంపీ గీతా కోడ సోమవారంనాడు బీజేపీలో చేరారు. జార్ఖఆండ్ బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండి సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను(Amith Shah) ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం విదితమే.
జార్ఖాండ్‌లో హేమంత్ సోరెన్ రాజీనామాతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంపయి సోరెన్ కు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త మంత్రివర్గంలో చోటుదక్కని సుమారు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంపయి సోరెన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ హుటాహుటిన ఆదివారంనాడు ఢిల్లీకి చేరుకున్నారు.