Home » Israeli-Hamas Conflict
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి ఇజ్రాయిల్(Israel)లోని టెల్ అవీవ్(Tel Aviv) పట్టణానికి వెళ్లే విమానాలను రద్దు చేసింది.
ఇజ్రాయిల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ చేసిన దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు రెండు వైపుల మృతుల సంఖ్య 500కు చేరింది. వీరిలో ఇజ్రాయిల్ పౌరులు 300 మంది ఉండగా, గాజా పౌరులు 200 వరకు ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హరాకత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా (హమాస్) శనివారం చేసిన భీకర దాడులకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది.
ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడులకు తెగపడిన పాలస్తీనా హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ‘‘ గాజా నగరంలో వాళ్లు దాక్కున్న ప్రాంతాలు శిథిలమవుతాయి’’ అని వార్నింగ్ ఇచ్చారు. గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.