Home » Israel Hamas War
ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు.. అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్‌కే (Israel) మద్దతు తెలిపింది. ఆ దేశానికి తనవంతు సహకారం అందించింది. కానీ.. గాజాలో (Gaza Strip) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో, అమెరికా స్వరం మారింది. క్రమంగా ఆ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ తీరుని తప్పుపడుతూ వచ్చింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి(Israel Hamas war) గాజా పౌరులు(gaza people) అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడి వారని ఆదుకునేందుకు పలు దేశాలు సహా ఐరాస రిలీఫ్ ప్యాకేజీలను పంపిస్తుంది. కానీ తాజాగా పంపించిన ప్యాకేజీ కూడా పలువురి పాలిట విషాదంగా మారింది.
ఇజ్రాయెల్‌పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Israel hamas war) ఇంకా ముగియకపోగా..అది మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఒక ఆసుపత్రి సమీపంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 11 మంది మరణించారు.
ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్ శతాయే (Mohammad Shtayyeh) ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పాలస్తీనా అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్‌కు (Mahmoud Abbas) సోమవారం అందజేశారు.
అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాద సంస్థ అయిన హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా.. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఏంటి? ఇన్నాళ్లూ హమాస్ పాలించిన ఆ ప్రాంతాన్ని యుద్ధం అనంతరం ఎవరు పాలిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు నెలల పైనే అవుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధానికి బీజం వేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో.. గాజాపై వైమానిక, భూతల దాడులతో విజృంభిస్తోంది.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంతో ఆ నేలలో నెత్తుటేళ్లు పొంగుతున్నాయి. జనవరి 15నాటికి యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయింది. అక్టోబర్ 7 న ప్రారంభమై యుద్ధం వేల సంఖ్యలో అమాయకపు ప్రజల ప్రాణాలను బలికొంది. శాంతి చర్చలకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక గాజా పౌరుడు, IDF అధికారి మధ్య ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేసింది.