Home » IPL 2025
ఇషాన్ కిషన్ ధాటిగా 94 నాటౌట్ స్కోరు చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 231 పరుగులు చేసి, ఆర్‌సీబీపై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఐదు ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన బెంగళూరు పోరాటం విఫలమైంది.
ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన బెంగళూరు ఏం ఎంచుకుంది.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2025లో ఇవాళ రసవత్తర పోరు జరగబోతోంది. ఈ మ్యాచ్ రిజల్ట్‌తో పాయింట్స్ టేబుల్‌లో పెద్దగా మార్పులు ఉండవని కొందరు అనుకుంటున్నారు. కానీ తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది ఆర్సీబీ. నెగ్గడంతో పాటు పరువును కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఐపీఎల్ మ్యాచుల్లో తెగ హల్‌చల్ చేస్తూ ఉంటుంది పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా. గెలుపోటములతో సంబంధం లేకుండా తన జట్టుకు ఆమె మద్దతుగా నిలుస్తుంది. పంజాబ్ ఆటగాళ్లను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఇతర జట్ల అభిమానులు కూడా ఇష్టపడతారు. అలాంటి ప్రీతి జింటా ఇప్పుడు కోర్టుకెక్కింది. అదీ ఐపీఎల్ విషయంలోనే కావడం గమనార్హం.
ఐపీఎల్ 2025 దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే నాలుగు ప్లే ఆఫ్ జట్లు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే నేడు ఆర్సీబీ, హైదరాబాద్ జట్ల (RCB vs SRH) మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే ఈ మ్యాచులో ఓవైపు ఆర్సీబీ గెలవాలని చూస్తుండగా, హైదరాబాద్ సైతం విజయం సాధించాలని భావిస్తోంది.
అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టేబుల్ టాప్ జట్టు అయిన గుజరాత్ టైటాన్స్‌పై సాధికారిక విజయాన్ని సాధించింది. 33 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఓపెనర్ మిచెల్ మార్ష్ (117) అద్భుత సెంచరీతో చెలరేగడంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది. మార్ష్‌కు తోడు నికోలస్ పూరన్ (56 నాటౌట్) కూడా తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గుజరాత్ ముందు లఖ్‌నవూ కొండంత టార్గెట్ ఉంచింది.
ఆస్ట్రేలియా టీ-20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తాజా ఐపీఎల్ సీజన్‌లో తన జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మిచెల్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి
ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టాప్-2 పోరు కోసం రెడీ అవుతోంది. లఖ్‌నవూతో పోరాటానికి రెడీ అవుతోంది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి
ఈ సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో జోరుమీదుంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లు మంచి జోష్‌తో ఆడుతూ విజయాలు సాధిస్తున్నారు. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.