IPL 2025, LSG vs GT: లఖ్‌నవూతో టాప్ ఫైట్.. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం అదే
ABN , Publish Date - May 22 , 2025 | 05:36 PM
ఈ సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో జోరుమీదుంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లు మంచి జోష్‌తో ఆడుతూ విజయాలు సాధిస్తున్నారు. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సీజన్‌లో (IPL 2025) అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుస విజయాలతో జోరుమీదుంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లు మంచి జోష్‌తో ఆడుతూ విజయాలు సాధిస్తున్నారు. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరినప్పటికీ పాయింట్ల పట్లికలో టాప్-2లో నిలవడమే లక్ష్యంగా ఈ రోజు బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది (GT vs LSG).
గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆరుసార్లు తలపడ్డాయి. అందులో నాలుగు సార్లు గుజరాత్‌దే విజయం. కేవలం రెండు సార్లు మాత్రమే లఖ్‌నవూ గెలుపొందింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు లఖ్‌నవూ కూడా ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ సీజన్ నుంచి నిష్క్రమించింది.

ఈ రోజు మ్యాచ్ జరగబోయే నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. బంతి చక్కగా బ్యాట్ మీదకు వస్తుంది. ఇక, అహ్మదాబాద్‌లో ఈ రోజు చాలా వేడిగా ఉండనుంది. మ్యాచ్ జరిగే సమయంలో చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్-2లో కొనసాగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి