Home » India vs Australia
2003 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? అప్పుడు కూడా భారత్, ఆస్ట్రేలియా మధ్యే మ్యాచ్ జరిగింది. ఆ ఫైనల్‌లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆ టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్లు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశారు...
వరల్డ్ కప్ 2023లో మన భారతీయ బౌలర్లు అద్భుత కనబరచడంతో.. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. వికెట్ల మీద వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాని మట్టికరిపిస్తారని భావించారు. ఆ అంచనాలకి తగినట్టుగానే మొదట్లో...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోరుకే తట్టాబుట్టా సర్దేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత అగ్రెసివ్‌గా ఆడుతాడో ప్రత్యేకంగా చెప్పుకోవనసరం లేదు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. అవతల బౌలర్లు ఎవరన్న సంగతి పట్టించుకోకుండా, దూకుడుగా ఆడుతాడు. ఎడాపెడా షాట్లతో చెలరేగిపోతాడు.
సినిమాల తరహాలోనే క్రీడల్లోనూ ఎన్నో సెంటిమెంట్లను అనుసరిస్తుంటారు. మైదానంలోకి దిగినప్పటి నుంచి గెలుపుదాకా.. ఎన్నో సెంటిమెంట్లను ఆపాదిస్తుంటారు. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ ఖప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అలాంటి లెక్కలు వేసుకుంటున్నారు.
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.
IND vs AUS Final: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 550కిపైగా పరుగులు చేశాడు. దీంతో 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
World Cup Final: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రదర్శన ఇచ్చాయి. మొత్తం 9 ఎయిర్‌క్రాఫ్ట్‌లు చేసిన విన్యాసాలు అలరించాయి.
IND vs AUS Final: ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
IND vs AUS Final: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. తుది పోరులో ట్రోఫి కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ పోరు కోసం భారత క్రికెటర్లు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆటగాళ్లు స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత ఆటగాళ్లు వెళ్తున్న కాన్వాయ్‌కు అభిమానులు అడుగడునా బ్రహ్మరథం పట్టారు.