Home » India vs Australia
ఏదైనా ఒక చారిత్రాత్మక ఘట్టంలో మనం గానీ, మన కుటుంబ సభ్యులు గానీ భాగమైతే.. అందులో ఉండే ఆనందమే వేరు. అదొక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడమే కాదు.. జీవితంలో ఒక మరపురాని సందర్భంగా నిలిచిపోతుంది.
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
2011 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లోకి వెళ్లడం, లీగ్ దశలో అఖండ విజయాలు నమోదు చేయడం చూసి.. ఈసారి భారత జట్టు తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందని క్రీడాభిమానులు బలంగా నమ్మారు. తీరా చూస్తే.. ఆ నమ్మకాల్ని భారత జట్టు వమ్ము చేసింది.
ఆదివారం (19-11-23) నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోరపరాజయం పాలయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ విఫలం కావడంతో ఆసీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. కానీ..
Mitchell, Marsh: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Shahid Afridi: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న టీమిండియాపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదీ విమర్శలు చేశాడు. అతి ఆత్మవిశ్వాసం ఖరీదైనదని నిరూపించబడిందని అన్నాడు. అతి ఆత్మవిశ్వాసమే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణమని ఓ పాకిస్థాన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్రిదీ వ్యాఖ్యానించాడు.
Narendra Modi Stadium: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయం కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా భాదిస్తోంది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది.
World Cup Final: సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 12 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీలు లేని లోటును తీర్చుకోవాలనే టీమిండియా ఆశ నెరవేరలేదు. ఫైనల్లో జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్ వరకు అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిన టీమిండియా తుది పోరులో మాత్రం తలవంచింది. అప్పటివరకు భీకరంగా ఆడిన మన వాళ్లు చివరి అడుగులో చేతులెత్తేశారు.
Rohit sharma Comments: ముచ్చటగా మూడో సారి కప్ గెలవాలనే ఆశ నెరవేరలేదు. మన ఆటగాళ్ల వైఫల్యానికి తోడు అది ఏదో పగబట్టినట్టుగా పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన కెప్టెన్ ఓటమిని ఒప్పుకున్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై గెలుపొంది.. ఆరోసారి ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో బాగా ఆడారని, అద్భుతంగా ఈ మెగా టోర్నీని...