Share News

Irfan Pathan: వరల్డ్‌కప్ ఫైనల్‌లో మస్కట్‌లుగా పిల్లలు.. ఇదో మరపురాని క్షణమన్న ఇర్ఫాన్ పఠాన్

ABN , First Publish Date - 2023-11-22T17:50:23+05:30 IST

ఏదైనా ఒక చారిత్రాత్మక ఘట్టంలో మనం గానీ, మన కుటుంబ సభ్యులు గానీ భాగమైతే.. అందులో ఉండే ఆనందమే వేరు. అదొక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడమే కాదు.. జీవితంలో ఒక మరపురాని సందర్భంగా నిలిచిపోతుంది.

Irfan Pathan: వరల్డ్‌కప్ ఫైనల్‌లో మస్కట్‌లుగా పిల్లలు.. ఇదో మరపురాని క్షణమన్న ఇర్ఫాన్ పఠాన్

IND vs AUS World Cup Final: ఏదైనా ఒక చారిత్రాత్మక ఘట్టంలో మనం గానీ, మన కుటుంబ సభ్యులు గానీ భాగమైతే.. అందులో ఉండే ఆనందమే వేరు. అదొక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడమే కాదు.. జీవితంలో ఒక మరపురాని సందర్భంగా నిలిచిపోతుంది. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కి కూడా తాజాగా అలాంటి సందర్భమే వచ్చింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు.. టీమిండియాతో కలిసి జాతీయ గీతం సమయంలో తన కుమారుడు, మేనల్లుడు మస్కట్‌లుగా నిలబడటాన్ని మరపురాని క్షణంగా అభివర్ణించాడు. ఆ ఫోటోని షేర్ చేస్తూ.. ఈ అవకాశం కల్పించినందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.


‘‘నా కొడుకు ఇమ్రాన్‌తో పాటు నా మేనల్లుళ్ళు అయాన్, రైయాన్‌లు.. ఫైనల్ మ్యాచ్‌కి ముందు జాతీయ గీతాపాలన సమయంలో జట్టుతో కలిసి మైదానంలో నిలబడటం నిజంగా జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకం. ఈ మరపురాని క్షణం కోసం ఐసీసీ, బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా.. ఈ ఫోటోలో అతని కుమారుడు, మేనల్లుళ్ల వెనుక కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్‌లు నిలబడి ఉండటాన్ని మనం చూడొచ్చు. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మీకు, మీ పిల్లలకు గర్వకారణమైన క్షణమని.. మీలాగే వాళ్లు కూడా భవిష్యత్తులో సూపర్‌స్టార్లుగా ఎదగాలని ఆశిస్తున్నట్టు నెటిజన్లు తమ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పంచుకున్నారు.

Updated Date - 2023-11-22T17:50:25+05:30 IST