• Home » INDIA Alliance

INDIA Alliance

Arvind Kejriwal: రాహుల్‌ను పీఎంగా కేజ్రీవాల్ అంగీకరిస్తారా? ఆయన ఏమి చెప్పారంటే..

Arvind Kejriwal: రాహుల్‌ను పీఎంగా కేజ్రీవాల్ అంగీకరిస్తారా? ఆయన ఏమి చెప్పారంటే..

ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని కేజ్రీవాల్ తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. వాళ్లు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు.

Jairam Ramesh: 'ఇండియా' కూటమి పీఎం అభ్యర్థి ఎంపికపై జైరామ్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Jairam Ramesh: 'ఇండియా' కూటమి పీఎం అభ్యర్థి ఎంపికపై జైరామ్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై 'ఇండియా' కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారంనాడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇదేమీ వ్యక్తుల మధ్య 'బ్యూటీ కాంటెస్ట్' కాదన్నారు.

Lok Sabah Polls 2024: ఆరో దశలో అదృష్టవంతులు ఎవరు.. ఇక్కడ పైచేయి సాధిస్తేనే ఇండియా కూటమికి ఛాన్స్..

Lok Sabah Polls 2024: ఆరో దశలో అదృష్టవంతులు ఎవరు.. ఇక్కడ పైచేయి సాధిస్తేనే ఇండియా కూటమికి ఛాన్స్..

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మరో రెండు దశలు పూర్తైతే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ ఈనెల 25వ తేదీన జరగనుంది.

PM Modi: నాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. సీక్రెట్ బయటపెట్టిన మోదీ..

PM Modi: నాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. సీక్రెట్ బయటపెట్టిన మోదీ..

ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Mallikarjun Kharge: 273 సీట్లతో 'ఇండియా' కూటమి గెలుస్తుంది..

Mallikarjun Kharge: 273 సీట్లతో 'ఇండియా' కూటమి గెలుస్తుంది..

లోక్‌సభకు ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో 'ఇండియా' కూటమి ఆధిక్యంలో ఉందని, మొత్తంగా 273కు పైగా సీట్లను తము కూటమి గెలుచుకోవడం ఖాయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుచేస్తే దేశం దివాళా తీయడం ఖాయం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుచేస్తే దేశం దివాళా తీయడం ఖాయం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls 2024)ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు.

PM Modi: వారు గెలిస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..విపక్షాలపై మోదీ తీవ్ర ఆరోపణలు

PM Modi: వారు గెలిస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..విపక్షాలపై మోదీ తీవ్ర ఆరోపణలు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, ఎస్పీతో కూడిన విప‌క్ష ఇండియా కూట‌మి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్‌లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: 125 సీట్లొచ్చినా..కేంద్రంలో అధికారం మాదే

CM Revanth Reddy: 125 సీట్లొచ్చినా..కేంద్రంలో అధికారం మాదే

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రె్‌సకు 125 సీట్లు వచ్చినా సరిపోతుందని, కూటమిలోని భాగస్వామ్యపక్షాలు మద్దతు ఇస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావాల్సి ఉంటుందన్నారు. ‘బీజేపీ సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌ (మెజారిటీ) దాటలేకపోతే.. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరు. కాంగ్రెస్‌ పరిస్థితి వేరు. మాకు మద్దతు పలికేందుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయి’ అని వివరించారు.

UP: యూపీలో ఎవరిది పైచేయి?

UP: యూపీలో ఎవరిది పైచేయి?

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది.

PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..

PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..

‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్‌ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి