Home » HYDRA
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కొరడా ఝుళిపిస్తోంది. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ సంస్థ..మళ్లీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్‌లో ఏటా 89 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా.. కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలో ఇంకుతోందని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) అన్నారు.
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. అల్మాస్ గూడలో మంగళవారం ఉదయం నుంచి మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా కొనసాగాయి. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు భయాందోళలనలు చెందుతున్నారు.
‘త్వరలో హైడ్రా పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేస్తాం. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తాం. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్ మున్సిపల్ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన షెడ్లు, కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు(Municipal and revenue officials) గురువారం కూల్చివేశారు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కార్యాలయంగా హైదరాబాద్ బేగంపేటలోని పైగా ప్యాలె్‌సను ప్రభుత్వం కేటాయించింది.
చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా(HYDRA) మరోసారి రంగంలోకి దిగింది. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పలు చెరువులను కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) పరిశీలించారు.
మాదాపూర్ ఈదులకుంట చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖానామెట్ విలేజ్ లో 6.5 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈదులకుంట చెరువు శిఖాన్ని పూడ్చివేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు.
యూసు్‌ఫగూడ సమీపంలోని మధురానగర్‌లో తాను నివసిస్తున్న ఇల్లు బఫర్‌జోన్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
నగరంలోని కృష్ణకాంత్ పార్కు ప్రాంతంలో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.