Home » Holi
తెలంగాణ వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. నిన్నంతా రాష్ట్ర ప్రజలు హోలీ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరిగాయి. కానీ ఈ వేడుకలు పలు చోట్ల విషాదం నింపాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
అయోధ్య(Ayodhya) శ్రీ రామ్‌లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం వెలిగిపోతోంది.
భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీ తన భార్య ఐకో సుజుకీతో కలిసి హోలీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వారిరువురు ఒకరికొకరు ఆప్యాయంగా రంగులు పూసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
హోలీ(Holi) పర్వదినాన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో విషాదం జరిగింది. గర్భగుడిలో భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పదుల సంఖ్యలో పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు గాయపడ్డారు.
Telangana: భాగ్యనగరంలో హోలీ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. హ్యాపీ హోలీ అంటూ యువత ఈరోజు (సోమవారం) తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా హోలీ వేడుకల్లో యువత ఉత్సాహం అంతాఇంతా కాదు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ కలర్‌ఫుల్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు.
Protection Of Eyes During Holi: హైదరాబాద్: హోలీ రోజు రంగుల్లో మునిగిపోతారు. రంగులు పూసే సమయంలో అవి ప్రమాదకరమైనవా.. కాదా అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. రసాయనిక రంగులతో హోలీ ఆడడం వల్ల కొన్నిసార్లు అనేక జబ్బులు వస్తున్నాయి...
నేడు (మార్చి 25న) దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగ హోలీ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఈర్ష్య, ద్వేషాలను మరచి ఒకరికొకరు రంగులు, గులాల్‌లు పూసుకుంటారు. దీంతోపాటు ప్రత్యేక వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. అయితే కఠినమైన హోలీ రంగులను ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
Holi Celebrations: ‘‘బురా మత్ మానో.. హోలీ హై..’’ అంటూ ఒకరికొకరు రంగులు (Colours) పులుముకుంటూ ఏళ్ల నాటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి హోలీకి (Holi) ఉంది. ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన ఈ వేడుకను ఏటా నగరంలో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ నివసిస్తున్న వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా కొందరు ఆదివారమే వేడుకల్లో మునిగిపోయారు...
ఈరోజు హోలీ(Holi) సందర్భంగా ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వర్ ఆలయం(Shree Mahakaleshwar Temple)లో భక్తులు(devotees) కలర్లతో మహాకాళుని సమక్షంలో ఉత్సాహంతో పండుగ జరుపుకుంటున్నారు. అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Telangana: నగర ప్రజలు కామ దహన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగకు ముందు రోజు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఎన్నేస్టి రోడ్‌లో కాముని దహనాన్ని నిర్వహించారు. మేతర్(వాల్మీకి) కులస్థులు ఈ దహన వేడుకలను జరిపారు. తమ ఆచారాలలో భాగంగా వాల్మీకి కులస్థులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.