Home » Guntur
Vijay Kumar ACB Investigation: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్ కుమార్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి పెండ్యాల జ్యోతి బర్డ్‌ఫ్లూ (H5N1)తో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆమె గత నెలలో అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, పుణె ల్యాబ్ పరీక్షల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయింది
పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో దారుణం జరిగింది. తమ్మిశెట్టి చిరంజీవి అనే వ్యక్తిపై ఓ యువతి పెట్రోలు పోసి నిప్పంటించింది.
Palnadu Crime: పల్నాడులో ఓ యువకుడిపై యువతి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
CM Chandrababu Comments: ఈనెలలోనే డీఎస్సీ పూర్తి చేసి జూన్‌లోగా టీచర్ల నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్లు తెరిచి చూడాలని అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా టీడీపీ హయాంలో నిర్మించిన భూగర్భ పైపులైను నిర్వహణ లేక వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతింది. దీంతో దాన్ని పూర్తిగా తొలగించి, మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది
తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేశ్. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైందని చెప్పారు.
గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన సుష్మ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్న ఆమె కుటుంబం, మంత్రి లోకేశ్ సహాయంతో అవయవాలను విభజించి ఇతరులకు ప్రాణదానం చేశారు. ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి గ్రీన్ చానల్ ద్వారా అవయవాలు త్వరగా ఇతర ఆసుపత్రులకు తరలించబడ్డాయి
Minister Nara Lokesh: ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా పరిష్కరిస్తున్నారు. అవయవ దానం గురించి మంత్రి లోకేష్‌కు గుంటూరులోని రమేష్ ఆస్పత్రి వైద్యులు, సంబంధిత కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. దీంతో వెంటనే లోకేష్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బీసీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి చెరువులోకి దిగి జారీపోయి మృతి చెందాడు. గురువారం బీసీ హాస్టల్‌లో నీరు లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు ఉదయం చెరువుకు వెళ్లారు. ఓ విద్యార్థి చెరువులోకి దిగి జారిపోవడంతో ఈ ఘటన జరిగింది.