Home » Guntur
తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
గుంటూరు జిల్లాలోని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,990.83 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ మేరకు నాలుగు కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా 41 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఢిల్లీ వచ్చారు.
గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహించారు.
గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తమపై రాళ్లు రువ్విన దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పొన్నూరు సమీపంలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
గుంటూరు నగరంలో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్ డీలర్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు(సీఎస్ డీటీలు) మధ్యన వార్ నడుస్తోంది. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల పేరుతో డీటీలు కొన్ని రేషన్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు.