Home » Guntakal
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-బరౌనీ ప్రత్యేక రైలు (నం. 06563)ను ఈ నెల 12, 19 తేదీల్లో బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత 14, 21 తేదీలలో రాత్రి 8 గంటలకు బరౌనీకి చేరుకుంటుందన్నారు.
తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. బడికి సరిగా వెళ్లడం లేదు. చిన్నోడు ఏమైపోతాడో అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇంటర్ చదువుతున్న అన్నకు ఆవేదన కలిగింది. ‘జులాయిగా తిరిగితే పాడైపోతావురా..! బాగా చదువుకో.. బడికి వెళ్లు.. అమ్మానాన్న నీ గురించి ఎంతగా బాధపడుతున్నారో చూడు..’ అని చాలా చెప్పి చూశాడు.
దానా తుపాను కారణంగా అనంతపురం(Anantapur) మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్ అండ్ డౌన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు.
అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని టీడీపీ ఇనచార్జి గుమ్మనూరు నారాయణస్వామి అన్నారు. స్ధానిక ఎస్‌జేపీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నియోజకవర్గస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన ఆధ్వర్యంలో టోర్నమెంట్, ఎంపిక పోటీలను నిర్వహించారు.
అమ్మ కడుపు నుంచి బయటికొచ్చి ఏడాది..! ఇంటిల్లిపాదీ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రోజులు గడుస్తున్నా బిడ్డ పరిస్థితి మెరుగుపడలేదు. ‘బెంగళూరుకో, కర్నూలుకో పోతాం.. రాసివ్వండి సార్..’ అని డాక్టర్‌ను అడిగితే.. ‘అంతా మీ ఇష్టమేనా..? ఇక్కడే బాగవుతుందిలే..’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఏమీ అనలేకపోయారు. ఇంకో రెండు రోజులు గడిచాక.. పరిస్థితి విషమించింది. ‘అంబులెన్స మాట్లాడుతా..! అందులో ఆక్సిజన ఉంటుంది. పెట్టుకోని వెంటనే ...
గుంతకల్లు బ్రాంచ(జీబీసీ) ప్రధాన కాలువ నాలుగో కిలోమీటర్ ఉండబండ పెద్ద కోతకు గురైన గట్టుకు రెం డు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని జీబీసీ ఈఈ వెంకటరమణ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం డీఈ రఘుచరణ్, ఏఈలు పల్లవి, రాజశేఖర్, మంజునాథతో కలిసి కాలువపై పర్యటించి, దెబ్బతిన్న గట్టును పరిశీలించా రు.
ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని గుంతకల్లు, పత్తికొండ రహదారులు దెబ్బతిన్నాయి. వీటిపై వెళ్లాలంటే ప్ర యాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతకల్లు రోడ్డులోని ఎంబీఏ కళాశాల ఎదురుగా పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. భారీ ఎత్తున గుంతలు పడి రోడ్డంతా ఆధ్వానంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే గుంతకల్లు రోడ్డులో గుంతను తప్పించే క్రమంలో ప్రయాణికులు ప్రమా దాలకు గురవుతున్నారు.
మున్సిపాలిటీపై పట్టు సడలుతోందని భావించి.. కౌన్సిల్ సమావేశం నుంచి చైర్‌పర్సన, కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. గుంతకల్లు మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ పదవి అంశాన్ని సాధారణ సమావేశం అజెండాలో చేర్చారు. చైర్‌పర్సన ఎన.భవాని అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అజెండా చదువుతుండగానే అన్ని సబ్జెక్టులను ఆమోదిస్తున్నామని, 13వ అంశంగా ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ నియామకపు ...
పురపాలక సంఘం స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారు నియామకం విషయంగా బుధవారం మునిసిపల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య బల ప్రదర్శన జరగనుంది. గతంలో నియమించిన స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారుగా జీపీ తిమ్మారెడ్డి రాజీనామా చేయడం తో ఆ పోస్టు నియామకానికి కౌన్సిల్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 13వ తేదీన దరఖాస్తు గడువు ముగియడంతో బుధవారం నిర్వహించేసాధారణ సమావేశంలో ...