Home » Gulf News
ఇరాన్ కీలక రాజకీయ నాయకుల మధ్య ఎడం పెరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. విదేశాంగ మంత్రిని తొలగించాల్సి రావచ్చని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన సన్నిహితుల వద్ద అన్నట్టు కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం, బెదిరింపుల మధ్య తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.
టెహ్రాన్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు శనివారం పునఃప్రారంభం అయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేలా పాక్‌లో మలివిడత శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్ తన సైనిక బలాన్ని బహిరంగంగా చాటిచెబుతోంది. టెహ్రాన్‌లోని రెవల్యూషన్ స్క్వేర్ వద్ద భారీ మిసైల్ ర్యాలీ చేపట్టింది. 2,000 కిలోమీటర్ల పరిధి కలిగిన లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించింది.
ఒమన్ తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న ఆయిల్ కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గన్‌బోట్ నౌకపై కాల్పులు జరిపినట్టు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ చెప్పింది.
ఇరాన్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణపై అమెరికా స్పష్టమైన ప్రకటన చేసింది. ఇది ఎల్లకాలం ఉండదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన బాధ్యతలను నెరవేర్చడానికి ఒక నిర్దిష్ట సమయం మాత్రమే కేటాయించామని పేర్కొంది.
యూఎస్‌తో శాంతి చర్చల్లో ఇరాన్ పాల్గొనదని అక్కడి ప్రభుత్వ మీడియా తాజాగా పేర్కొంది. యూఎస్ వైఖరే ఇందుకు కారణమని నిందించింది.
అణు కార్యక్రమాలు చేపట్టడం తమ హక్కు అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తాజాగా స్పష్టం చేశారు. దాన్ని హరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. తాజాగా హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
'ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు'.. ట్రంప్ చేసే సోషల్ మీడియా పోస్ట్‌లు, ఆయన ఇచ్చే ప్రకటనలు చాలా అయోమయంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఇరాన్ మంత్రి ఖతీబ్‌జాదే ఎద్దేవా చేశారు.