Home » Gulf News
గల్ఫ్ ఎన్నారైల వెతలు
సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్‍లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.
ఇటీవల విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఫైడి రాకేష్ రెడ్డి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
గల్ఫ్ కార్మికులను మోసం చేసింది బీజీపీ పార్టీనే అని ఎన్నారైలు ఫైర్ అయ్యారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు సతీష్ రాదారపు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికుల్లో అగ్రస్థానంలో ఉండే కేరళ ఇప్పుడు వెనకబడి పోయింది. ఆ స్థానాన్ని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ఆక్రమించాయి.
సుదీర్ఘ విరామం తరువాత పశ్చిమాసియా మళ్లీ కల్లోల మయింది. శాంతి చర్చల పేరుతో దశాబ్దాల పాటు కొనసాగిన తతంగంలో చివరకు పాలస్తీనియన్లు సాధించింది ఏమి లేకపోవడంతో పెల్లుబిక్కిన ఆక్రోశంతో ఉగ్రవాదం జడలు విప్పింది.
ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.
రాజకీయపార్టీలు అన్న తర్వాత సమయం, సందర్భానుసారం వ్యూహాలు రచించుకోవడం సహజం. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివింది.
తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆదివారం (10వ తేదీన) ఉదయం 10.10 గంటలకు జగిత్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి అవకాశం ఇవ్వాలని హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం సజీవదహనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టం మీద కొన్ని ఎముకలను మాత్రం సౌదీ పోలీసులు సేకరించగలిగారు. అయితే ఈ ఎముకలు ఎవరివి.? అన్నది కూడా గుర్తించేందుకు సౌదీ అరేబియా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.