Home » Gujarat Titans
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐపీఎల్ నిర్వహకులు షాకిచ్చారు. అసలే చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో గిల్ ఉన్నాడు. ఇలాంటి సమయంలో గిల్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
యువ బ్యాటర్లు చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నైసూపర్ కింగ్స్ జట్టు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాటర్లు శివమ్ దూబే(51), రచీన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాడ్ (46) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు.
ఐపీఎల్ 2024లో( IPL 2024) నేడు సూపర్ ఫైట్ జరగనుంది. గతేడాది ఫైనలిస్ట్‌లు గుజరాత్ టైటాన్, చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super Kings vs Gujarat Titans) తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. కెప్టెన్సీ మార్పు జరిగి 3 నెలలు గడిచినా అభిమానుల ఆగ్రహావేశాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు.
ఐపీఎల్ 2024లో నిన్న అహ్మదాబాద్(ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్(mumbai indians), గుజరాత్ టైటాన్స్(Gujarat titans) మధ్య జరిగిన మ్యాచులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తక్కువ పరుగుల(169) లక్ష్యంతో బరిలోకి ముంబై జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే గుజరాత్ గెలుపునకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా(3/14) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో ముంబై ఇండియన్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. బుమ్రాకు తోడుగా గెరాల్డ్ కోయెట్జీ(2/27) కూడా సత్తా చాటాడు. ముఖ్యంగా వీరిద్దరు డెత్ ఓవర్లలో గుజరాత్‌కు పరుగులు రాకుండా కట్టడి చేశారు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఐపీఎల్ 2024 రెండో విడత కూడా మన దేశంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించనున్నారని, అందుకోసం యూఏఈని పరిశీలిస్తున్నారని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఉర్రుతలూగిలించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మరొకొద్ది గంటల్లోనే ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది.