Home » Gorantla Butchaiah Choudary
AP Elections 2024: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది..
Rajahmundry Rural Ticket Issue: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్ తగ్గినట్టు అయింది..
‘రాజధాని పైల్స్’ సినిమా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?.. ప్రకటనలు పేరుతో వందల కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మృతి చెందిన ఓట్లను తొలగించలేదని, టీడీపీ హయాంలో రాజమండ్రిలో 6,200 టిడ్కో గృహాలు పూర్తి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లుగా టిడ్కో గృహాలు ఎందుకు లబ్ధిదారులకు అందజేయలేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను కలిసేందుకు సిద్ధం పేరుతో సీఎం జగన్ సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ సిద్ధం సభలకు వచ్చేందుకు జనం సిద్ధంగా లేరని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.
అమరావతి: రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని...
Andhrapradesh: అవినీతికి సహకరించే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎర్రగడ్డకు పంపించటానికి జగన్ అర్హుడు అంటూ ఎద్దేవా చేశారు.
మార్చాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రి జగన్ ( CM JAGAN ) నే అని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...గత ఎన్నికలల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాల్లో కొట్టుకొచ్చారని.. ఈసారి ఎన్నికల్లో వరదల్లో కొట్టుకుపోవడం ఖాయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.
Telugu Desam Party: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై బుచ్చయ్య చౌదరి ఓ ట్వీట్ చేశారు. శుక్రవారం విడుదలైన ప్రభాస్ సలార్ మూవీని ప్రస్తావిస్తూ ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కోర్టులో ఫైళ్లను మాయం చేసి, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా, సిలికాన్ దోపిడీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ) మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary )విమర్శించారు.
సీఐడీ వాళ్ళు తనకు నోటీసులు ఇచ్చినట్టు వైసీపీ ప్రచారం చేసిందని.. సీఐడీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించే వారిని జైలులో పెడుతున్నారు. జగన్ గ్యాంగ్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు. నిత్యం 144, 30 సెక్షన్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జగన్ సీఐడీతో కలిసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.