• Home » God

God

GOD : త్యాగానికి ప్రతీక బక్రీద్‌

GOD : త్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగనిరతికి, దాన గుణానికి ప్రతీక బక్రీద్‌ పండుగ జామియా మసీదు మౌలానా అబ్దూల్‌ మన్నాన, ముతు వల్లి నూరుల్లా ఖాన, కోశాధికారి సిరాజ్‌ పేర్కొన్నారు. బక్రీద్‌ పర్వదినాన్ని సోమవారం పట్టణ పరిధిలోని అల్‌హిలాల్‌ పాఠశాల ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్‌ శుభాకాం క్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మౌలానా బక్రీద్‌ విశిష్టతను వివరించారు.

GOD : నయనానందకరం శ్రీవారి కల్యాణం

GOD : నయనానందకరం శ్రీవారి కల్యాణం

పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో వెలసిన బాలాజీ ఆలయంలో గోదాదేవి, లక్ష్మీదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం నయనానందకరంగా జరిగింది. ఈ సందర్బంగా ఉదయం స్వామి వారి మూల విరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి బెంగళూ రు నుంచి తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

GOD : ఎర్రబల్లిలో గంగమ్మ జాతర

GOD : ఎర్రబల్లిలో గంగమ్మ జాతర

మండలంలోని ఎర్రబల్లిలో గంగమ్మ జాతర వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యం లో గంగమ్మ నూతన ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41రోజులు కావడంతో జాతర చేశారు.

GOD : కన్నులపండువగా గంగమ్మ జ్యోతుల ఉత్సవం

GOD : కన్నులపండువగా గంగమ్మ జ్యోతుల ఉత్సవం

పట్టణ పరిధిలోని రెండో మోడల్‌ కాలనీలో వెలసి న గంగమ్మ దేవత ఆలయంలో మంగళవారం జ్యోతుల మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం బెస్త సం ఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తెలవారు జాము న నుంచే అమ్మవారి మూల విరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరిం చా రు. అర్చనలు తదితర పూజా కార్యక్రామలు చేశారు.

GOD : ఘనంగా శనీశ్వర జయంతి

GOD : ఘనంగా శనీశ్వర జయంతి

భక్తులు కొంగు బంగారంగా కొలిచే, నవగ్రహాలలో ఒకరై న శనీశ్వరుడి జ యంతిని గురువారం పావగడ శనీశ్వర ఆలయంలో ఘనం గా నిర్వహించారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల గుడ్డ, నూగులతో ఉదయం 4గంటల కు తైలాభి షేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పావగడలో వెలసిన జేష్టదేవి సమేతుడైన శనీశ్వరుడిని పు ట్టినరోజు సందర్భంగా దర్శించుకుంటే పంచమ శని, అష్టమశని, ఏలినా టిశని, కాకి స్పర్శ తదితర దోషాలు తొలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని భక్తుల విశ్వాసం.

GOK : వైభవంగా చందకచర్ల ఆంజనేయస్వామి రథోత్సవం

GOK : వైభవంగా చందకచర్ల ఆంజనేయస్వామి రథోత్సవం

మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివా రం అత్యంత వైభవంగా జరింగింది. ఈ సం దర్భంగా ఉదయం స్వామి వారికి వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంక రించా రు. అర్భనలు తదితర పూజలు చేశారు. ఆల యం ఆరణంలో హోమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు జ్యోతుల తో ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నా రు.

GOD : పవనపుత్రా పాహిమాం..!

GOD : పవనపుత్రా పాహిమాం..!

హనుమజ్జయంతి వేడుకలను ఆంజనేయ స్వామి ఆలయాల్లో శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే మూల విరాట్లకు వివిధ అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే హనుమాన చాలీసా పారా యణం, భజనలు, రామ కీర్తనలు, రామ నామం, ఆంజనేయ దండకంతో ఆలయాలు మార్మోగాయి. పలు ఆలయాల్లో సీతారామకల్యాణోత్సవం నిర్వహించారు.

God: ముగిసిన బ్రహ్మోత్సవాలు

God: ముగిసిన బ్రహ్మోత్సవాలు

మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ నెల 21 నుంచి ఉత్సవాలు వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆమిద్యాలకు తీసుకెళ్లారు.

FESTIVALS : నేటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

FESTIVALS : నేటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

మండలంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయస్వామి బ్రహ్మోత్స వాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు దేవదాయశాఖ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారి ఆలయంలో ద్వారారాధన, అంకు రార్పణ, కుంభారాధన, హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Temple: వైభవంగా ధ్వజారోహణం

Temple: వైభవంగా ధ్వజారోహణం

మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్య క్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజరోహణ కార్యక్ర మాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథా చార్యులు శాస్రోక్తంగా నిర్వహిచారు. రాత్రి ప్రాకా రోత్సవాన్ని నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి