GOD : నయనానందకరం శ్రీవారి కల్యాణం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:30 AM
పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో వెలసిన బాలాజీ ఆలయంలో గోదాదేవి, లక్ష్మీదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం నయనానందకరంగా జరిగింది. ఈ సందర్బంగా ఉదయం స్వామి వారి మూల విరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి బెంగళూ రు నుంచి తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

హిందూపురం అర్బన, జూన 16: పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో వెలసిన బాలాజీ ఆలయంలో గోదాదేవి, లక్ష్మీదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం నయనానందకరంగా జరిగింది. ఈ సందర్బంగా ఉదయం స్వామి వారి మూల విరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి బెంగళూ రు నుంచి తెప్పించిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11.15 నిమిషాలకు కర్కాటక లగ్న మందు వేదపండితుల మంత్రోచ్ఛారణ, మం గళవాయుద్యాల నడుమ శాస్ర్తోక్తంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని జరిపించారు. అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీవారి కల్యాణాన్ని తిలకించారు. అనం తరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం విద్యాధరి కళానిలయం వారిచే నిర్వహించిన నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
కైవారం తాతయ్య ఆరాధనోత్సవాలు
హిందూపురం అర్బన, జూన 16: పట్టణ పరిధి లోని కేవీఆర్ ఫంక్షన హాల్‌లో శనవారం కైవారం తాత య్య 189వ ఆరాధనోత్సవాలను భక్తి శ్రద్దలతో నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి వారి విగ్రహానికి వివిధ అభిషేకాలు, అర్చనలు చేశారు. అలాగే 24 గంటల పాటు అఖండ రామభజన చేసి, ఆదివారం ఉదయం పురవీధు ల్లో నగర సంకీర్తన చేపట్టారు. హిందూపురం ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కైవారం తాతయ్య ట్రస్ట్ బోర్డు సభ్యుడు బాగేపల్లి నరసింహయ్య, కృష్ణయ్య, కుప్పం వెంకటాచలపతి తదితరులు హాజరయ్యారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....