GOD : ఘనంగా శనీశ్వర జయంతి
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:23 AM
భక్తులు కొంగు బంగారంగా కొలిచే, నవగ్రహాలలో ఒకరై న శనీశ్వరుడి జ యంతిని గురువారం పావగడ శనీశ్వర ఆలయంలో ఘనం గా నిర్వహించారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల గుడ్డ, నూగులతో ఉదయం 4గంటల కు తైలాభి షేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పావగడలో వెలసిన జేష్టదేవి సమేతుడైన శనీశ్వరుడిని పు ట్టినరోజు సందర్భంగా దర్శించుకుంటే పంచమ శని, అష్టమశని, ఏలినా టిశని, కాకి స్పర్శ తదితర దోషాలు తొలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని భక్తుల విశ్వాసం.

పావగడ, జూన 6 : భక్తులు కొంగు బంగారంగా కొలిచే, నవగ్రహాలలో ఒకరై న శనీశ్వరుడి జ యంతిని గురువారం పావగడ శనీశ్వర ఆలయంలో ఘనం గా నిర్వహించారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల గుడ్డ, నూగులతో ఉదయం 4గంటల కు తైలాభి షేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పావగడలో వెలసిన జేష్టదేవి సమేతుడైన శనీశ్వరుడిని పు ట్టినరోజు సందర్భంగా దర్శించుకుంటే పంచమ శని, అష్టమశని, ఏలినా టిశని, కాకి స్పర్శ తదితర దోషాలు తొలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని భక్తుల విశ్వాసం. నవగ్రహాలను పూజిస్తే ఎంతో మేలు జరుగు తుందని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శాస్ర్తి తెలిపారు.
హిందూపురం అర్బన: వైశఖ బహుళ అమావాస్య శనీశ్వరస్వామి జయంతి ని పురస్కరించుకొని పట్టణ పరిధిలో పలు ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. శనిమ హాత్ముడని పుట్టినరోజున కొలిస్తే కష్టాలు తొలుగుతా యని భక్తుల నమ్మకం. దీం తో శ్రీకంఠపురం, టీచర్స్ కాలనీలోని శనీశ్వర దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచి స్వామి వారికి వివిద అభిషేకాలు, అర్చనలు చేశారు. స్వామికి ప్రీతికర మైనదని నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులనూనె దీపాలు వెలిగించా రు. ఈ సందర్బంగా శ్రీకంఠపురంలోని శనేశ్వరస్వామి ఆలయంలో మూల విరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు రవిస్వామి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. నానెప్పనగర్‌లోని షిర్డీసాయి ఆలయంలో గురువారం పురస్కరించుకొని భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. షిర్డీసాయిని దర్శించుకుని పూజలు చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....