Home » Gautam Gambhir
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిత్యం బద్ద శత్రువులుగా కనిపించే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ వేదికగా ఒకటయ్యారు.
సాధారణంగా.. మన భారత రాజకీయాల్లో (Indian Politics) సిట్టింగ్ ఎంపీలు పోటీ నుంచి తప్పించుకోవడం అనేది చాలా అరుదు. అందునా.. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు, తమకు మరోసారి పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పడం దాదాపు అసాధ్యం. అలాంటిది.. బీజేపీకి (BJP) చెందిన ఇద్దరు ఎంపీలు గంటల వ్యవధిలోనే తాము లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని, ఆ పనుల నుంచి తమని తప్పించాలని కోరామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని హజారిబాగ్ ఎంపీ జయంత్ సిన్హా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ఎన్నికల విధుల నుంచి తప్పుకున్న తర్వాత వాతావరణ మార్పులపై దృష్టిసారిస్తానని సోషల్ మీడియా ఎక్స్‌లో జయంత్ సిన్హా ట్వీట్ చేశారు.
భారతీయ జనతా పార్టీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు.
గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్‌లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు.
మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26 నుంచి తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. దీంతో ఈ సారి సౌతాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Suresh Raina: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీకి, సురేష్ రైనాకు మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 అనగానే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌ల మధ్య జరిగిన గొడవే చాలా మందికి గుర్తుకొస్తుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Gautham Gambhir: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓడిపోవడంపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కూర్పుపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు చాలా తక్కువ మ్యాచ్‌లు ఉన్నాయని.. అలాంటి సమయంలో ఇలాంటి ప్రయోగాలు ఏంటని మండిపడ్డాడు.