Home » Exams
సోమవారం పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ సారి మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రంజాన్ పండుగ ఆధారంగా చివరి పరీక్ష మార్చి 31వ తేదీన కానీ, ఏప్రిల్ ఒకటవ తేదీన కానీ, నిర్వహించనున్నారు.
పాము కాటు వేసినా ఓ పిల్లాడు పరీక్షలు రాశాడు. నేరుగా ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. శ్రద్ధగా పరీక్షలు రాశాడు. పరీక్ష రాసిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పిల్లాడికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.
పబ్లిక్ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత వంద రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది.
సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం వచ్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. పదో తరగతి విద్యార్థులంతా సోమవారం జరిగే పరీక్షలకు హాజరుకావాలని, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పోటీ పరీక్షల ఫలితాల్లో పురుషుల హవా కొనసాగుతోంది. గ్రూప్-3 పరీక్ష ఫలితాల్లోనూ వారే టాపర్లుగా నిలిచారు. గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది.
పదో తరగతి ఖమ్మంలో, ఇంటర్ విజయవాడ, బీటెక్ తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో పూర్తి చేశా. సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్స్ ఫలితాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 09:30 గంటల నుంచీ మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.
Inter Second Year Exams: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్ పరీక్షల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఈ నెల 1న జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లగా..