Share News

Intermediate English Paper: ఇంటర్‌ ప్రశ్నపత్రంలో తప్పులు

ABN , Publish Date - Mar 06 , 2025 | 06:36 AM

ఇంటర్‌ పరీక్షల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఈ నెల 1న జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లగా..

Intermediate English Paper:  ఇంటర్‌ ప్రశ్నపత్రంలో తప్పులు

  • రెండు ప్రశ్నలకు సరిగా ప్రింట్‌ కాని డయాగ్రంలు

అమరావతి, నెల్లూరు (విద్య), మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఈ నెల 1న జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లగా.. తాజాగా బుధవారం జరిగిన ఇంటర్‌ రెండో సంవత్సరం ఇంగ్లీషు ప్రశ్నపత్రంలో కూడా రెండు తప్పులు కనిపించాయి. డయాగ్రాం ఆధారంగా ఇచ్చిన రెండు ఐదు మార్కుల ప్రశ్నలకు డయాగ్రాంలు సరిగా ప్రింట్‌ కాలేదు. డయాగ్రాంలలో ఇచ్చిన అంకెలు, పదాలు మసక (బ్లర్‌)గా కనిపించడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన ఇంటర్‌ విద్యా మండలి అధికారులు వెంటనే స్పందించి.. సరిగా కనిపించని అంకెలు, పదాలను ఇన్విజిలేటర్ల ద్వారా బోర్డులపై రాయించారు. కొన్నిచోట్ల మౌఖికంగా విద్యార్థులకు వాటిని తెలియజేశారు. మరికొన్ని చోట్ల తెల్ల కాగితంపై రాసి విద్యార్థులకు పంచి పెట్టారు. కాగా, ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణకు ఇచ్చే ముందు పరిశీలించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ఈ తప్పిదాలకు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లీషు పేపర్‌లో వచ్చిన తప్పులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తప్పు వచ్చిన రెండు ప్రశ్నలకు అదనపు మార్కులు వేయాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 06 , 2025 | 06:36 AM