Home » Enforcement Directorate
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈనెల 8, 9 వ తేదీల్లో బీఎల్ఎన్రెడ్డి, అరవింద్‌కుమార్‌లకు రావాల్సిందిగా పిలిచింది.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈ మెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు.
Telangana: ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు అరవింద్ విచారణకు రావాల్సి ఉంది.
Telangana: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి ఏసీబీ అందజేసింది. ఏసీబీ ఇచ్చిన వివరాలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈడీ విచారణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 7 జనవరి, 2025న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినా.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గం ఆందోళనలో ఉంది. మరోవైపు ఈ రేసు కేసుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కాకినాడ సీ పోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది.
సాహితీ ఇన్ఫ్రా మోసాలకు సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్‌లో రెండుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.6.15 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు పెట్టారు.
భాగ్యనరంలో ఈడీ రైడ్స్ కలకలం రేపింది. నగర వ్యాప్తంగా 8 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఫైనాన్సియర్ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు అధికారులు.