Home » Enforcement Directorate
ED Questioned Allu Aravind: రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ కొనసాగింది.
తొంభై కోట్ల రూపాయల అప్పును సాకుగా చూపి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుట్రపన్నారని ఈడీ ఆరోపించింది.
ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా ఒడిశాలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ED investigation: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరింది. ముడుపులు ఎవరికి చేరాయో తెలుసుకునేందుకు సిట్, ఈడీ కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.
రూ.12,000 కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్‌ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ TASMACపై దర్యాప్తులో ED చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈడీ అన్ని పరిమితులు దాటుతోందని వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ధి పొందారని బుధవారం నాడు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది.
ED Summons: టాలీవుడ్ హీరో మహేష్ బాబు సోమవారం విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు ఈ రోజు విచారణకు హాజరవుతారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. దుబాయ్, ఆఫ్రికాకు హవాలా మార్గంలో డబ్బులు వెళ్లినట్లు గుర్తించి షెల్ కంపెనీల గుట్టును ఛేదించేందుకు కేంద్ర సంస్థ సిద్ధమవుతోంది
AP Liquor Scam ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది