Home » Employees
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
పోడు రైతులకు ఇబ్బందులు కలిగించబోమని, అదే సమయంలో అటవీ అధికారులపై దాడులు చేస్తే సహించబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు సాగుదారుల హక్కులను కాపాడడంతోపాటు అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు సకాలంలో జరగకపోవడంతో వారంతా సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయాల్సివస్తోంది. కొందరు ఉద్యోగులు 15 ఏళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతుండగా, మరికొందరు పదేళ్లుగా, ఇంకొందరు ఐదేళ్లుగా ఒకే కుర్చీకి పరిమితమయ్యారు.
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్.. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల సమస్య త్వరలోనే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును తుది దశకు తెచ్చింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది.
గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. వారి మూల వేతనంపై 50ు వేతనం పెంచాలని రాష్ట్ర సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గత తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నేటి నుంచి చేపట్టనున్నారు. నిరుడు సెప్టెంబరు-3న వీటిని చేపట్టాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ.. పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, విషయం కోర్టుకు వెళ్లడంతో వాయిదాపడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వణికించాయి. ఊహించినట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తారు. వైసీపీ అభ్యర్థులు సైతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తగ్గించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఓట్లను ఇనవ్యాలీడ్ చేయించేందుకు కోర్టులకు ఎక్కారు. అన్ని అడ్డంకులను దాటుకుని.. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా, ఇన వ్యాలీడ్ ఓట్లు భారీగానే నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,582 పోస్టల్ ఓట్లు చెల్లలేదు. ...