Home » Eluru
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది. ఇసుక నుంచి బెరైటీస్ వరకూ... క్వార్ట్జ్ నుంచి గ్రానైట్ వరకూ దేన్నీ వదలకుండా వైసీపీ నేతలు, వారికి కొమ్ముకాసే కంపెనీలు అడ్డగోలుగా దోచుకొని రూ.కోట్లు దండుకున్నారు.
ఏలూరు జిల్లాలో బ్యాంకు మేనేజరు నుంచి లేడీ రౌడీ షీటరుగా అవతరించిన ఈమె హిస్టరీ అంతా ఆగడాలు.. అరాచకాలే! పని చేస్తున్న బ్యాంకులో బంగారం చోరీచేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది.
Andhrapradesh: మర్రిబంధం గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి, ఆమె అనుచరులు పట్టుకున్నారు.
Fake Currency: ఏపీలోని రెండు జిల్లాల్లో దొంగ నోట్లు కలకలం రేగింది. మచిలీపట్నం నగరంలోని వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. అలాగే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమలలో కూడా నకిలీ కరెన్సీ కలకలం రేగింది.
జనసేన నేత వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకల్లో మద్యం ఏరులై పారింది. అమ్మాయిలతో పూర్తి అశ్లీలంగా డ్యాన్సులు చేయించడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి భర్త ధర్మరాజును రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.33 కోట్ల నగదు లావాదేవీల వ్యవహారంలో అధికారులు అతన్ని అరెస్టు చేయగా, ఆయన భార్య రాణి మాత్రం పరారీలో ఉన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని బుధవారం సైకిల్ ఎక్కబోతున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో..
నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి 39వ పిల్లర్ వద్ద శనివారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు గుర్తించారు.