Eluru : పంచాంగకర్త కాశీబొట్ల కన్నుమూత
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:17 AM
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పంచాంగకర్త, ఆస్థాన సిద్ధాంతి కాశీబొట్ల వీరవెంకట నాగేశ్వర కృష్ణప్రసాద్ శాస్త్రి(65) సోమవారం కన్నుమూశారు.
ఏలూరు సిటీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం, శ్రీ జగద్గురు దత్తాత్రేయస్వామి మహా సంస్థాన పీఠం, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పంచాంగకర్త, ఆస్థాన సిద్ధాంతి కాశీబొట్ల వీరవెంకట నాగేశ్వర కృష్ణప్రసాద్ శాస్త్రి(65) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాశీబొట్ల వాస్తు శాస్త్రంలో సిద్ధహస్తుడు. జ్యోతిష్య కేసరి, సిద్ధాంత శిరోభూషణ అవార్డులు స్వీకరించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానపల్లికి చెందిన ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.