Home » Elections
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా అని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్‌కుమార్ యాదవ్ నిలదీశారు.
ప్రత్యర్థి పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఏఐ వీడియోలతో ప్రచారం నిర్వహించడంపై ఈసీ నిషేధం విధించింది. ఏఐ సాంకేతికత దుర్వినియోగం కావొద్దన్నదే తమ అభిమతమని పేర్కొంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటికి దూరంగా ఉండాలని, ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో ఈ రోజు(మంగళవారం) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్‌ని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి పెట్టింది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.
రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్ రావు.