Home » Dwarampudi Chandra Sekhara Reddy
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తుండటంతో కొందరు నేతలు చిత్రవిచిత్రాలుగా ప్రవర్తిస్తున్నారు.. ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటరివ్వాలో తెలియట్లేదేమో కానీ.. ఒక్కోసారి తనకు సంబంధంలేని విషయాల్లో తల దూరుస్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan kalyan) వారాహి యాత్రతో (Varahi Yatra) జిల్లాల పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు జనసేన నేతలు ఝలక్ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ముద్రగడకు వెయ్యి రూపాయిల చొప్పున మనియార్డర్ పంపుతున్నారు. ఇందు కోసం యువకులు వందల్లో పోస్ట్ ఆఫీస్‌ల వద్ద క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఇటీవల ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడలో తనపై పోటీ చేయాలని వ్యాఖ్యలు చేశారు. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నారన్నారు.
వారాహి యాత్రలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ద్వారంపూడి కూడా అదే స్థాయిలో పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి విరుచుకుపడ్డారు.