Home » Drugs Case
Hyderabad: డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సాఫ్ట్ వేరు ఉద్యోగులతోపాటు వ్యాపారస్తులే లక్ష్యంగా అతడు ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో లైతన దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మస్తాన్ సాయిని వారం రోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.
KP Chowdhary: డ్రగ్స్ కేసులో సంచలనం సృష్టించిన కేపీ చౌదరి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆనారోగ్య కారణాలతోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Drugs Racket: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పెద్దమొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. గ్రామీణ ప్రాంతాల యువత మత్తుకు అలవాటు పడటంతో స్థానికంగా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది.
గ్యాస్ రిపేర్ పని పేరుతో డ్రగ్స్ దందా సాగిస్తున్న అంతరాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
CP Sudhir Babu: డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు.డ్రగ్స్ సమాచారం తెలిస్తే తమకు వెంటనే తెలియజేయాలని అన్నారు. డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
రసాయన కంపెనీ మాటున కల్లు కల్తీకి వినియోగించే ఆల్ర్ఫాజోలం డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును సంగారెడ్డి సీసీఎస్, గుమ్మడిదల పోలీసులు రట్టు చేశారు.
గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యాపారి... అర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు డ్రగ్స్ దందాలోకి దిగాడు.
హైదరాబాద్: తెలుగు నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది.