Home » DMK
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.
బీజేపీ రాష మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన అత్యాచారం కేసుతో కోట్టూరుపురం డీఎంకే స్థానిక నాయకుడు షణ్ముగంకు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంకు సంబంధాలున్నాయని అన్నామలై ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..
ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే.. అంటూ డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. జూన్ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు.
హీరోగారూ.. ఆ పార్టీని ఓడిద్దాం... మా కూటమిలోకి రండి,, అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆహ్వానించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీ కూడా చేరితే ఇక తిరుగులేని విజయం ఖాయమన్నారు.
సినిమాల్లో అనేక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభకు (Kamal Haasan Rajya Sabha) వెళ్లనున్నారు. ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
అధికార డీఎంకే పార్టీపై ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ధ్వజమెత్తారు. ఇది దురహంకార ఫాసిస్ట్ పాలన.. అంటూ ఆమన మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఆ హీరో ఓ బచ్చా.. ఎవరెన్ని చెప్పినా.. మళ్లీ అధికారం డీఎంకే పార్టీదేనని రాష్ట్రమంత్రి దురైమురుగన్ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు తమిళనాట సంచలనానికి దారితీశాయి. మరికొద్ది రోజుల్లో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారంనాడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల స్టేట్ రన్ లిక్కర్ కార్పొరేషన్ 'టాస్మాక్ ' కార్యాలయంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో స్టాలిన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని విపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది.
మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తథ్యం అని మాజీమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్‌కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.
అగ్ర హీరో విజయ్ ఏర్పాటుచేసిన టీవీకే పార్టీ విజయావకాశాలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడా పళనిస్వామి రహస్య సర్వే జరిపించారనే వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవగా.. హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ప్రభావం ఎంత అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.